Share News

రామోజీరావు మృతికి సంతాపం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:44 PM

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భారంతికి గురి చేసిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

రామోజీరావు మృతికి సంతాపం
అరసవల్లి: ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

అరసవల్లి: ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భారంతికి గురి చేసిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాదులోని ఫిలిం సిటీలో రామోజీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- కవిటి/కంచిలి: రామోజీరావు మృతి తీరని లోటని కవి టి, కంచిలి టీడీపీ నాయకులు అన్నారు. శనివారం ఆయా మండలాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అలాగే జనసేన పార్టీ నాయకులు లోల్ల రాజేష్‌ ఆధ్వర్యంలో సంతాపభ సభ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయ కులు బంగారు కురయ్య, మాదిని రామారావు, పైల పురుషో త్తం, సూర్యనారాయణ, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

- ఇచ్ఛాపురం: రామోజీరావు మృతి తీరని లోటని టీడీ పీ పట్టణ అధ్యక్షుడు కాళ్ల ధర్మారావు అన్నారు. శనివారం పా ర్టీ కార్యాలయంలో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షు డు కాళ్ల జయదేవ్‌, నాయకులు సహదేవ్‌రెడ్డి, దక్కత కామేష్‌, ఎన్‌.కోటి తదితరులు పాల్గొన్నారు.

- ఎచ్చెర్ల: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృ తికి టీడీపీ నేతలు శనివారం నివాళులర్పించారు. ఎచ్చెర్లలోని టీడీపీ కార్యాలయంలో, ఎస్‌ఎం పురంలో ఆయన చిత్ర పటాని కి పూలమాలలు వేసి శ్రద్ధంజలి ఘటించారు. ఎస్‌ఎం పురం లో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, పార్టీ నేతలు గాలి వెంకటరెడ్డి, అల్లుపల్లి రాంబాబు, గూరు జగపతిబాబు, గాడు రామారావు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఎచ్చెర్ల, లావేరు మండలాల పార్టీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌, నాయకలు వావిలపల్లి రామకృష్ణ, అన్నెపు భువనేశ్వరరావు, పైడి అన్నం నాయుడు, సంధ్యా గజపతి తదితరులు పాల్గొన్నారు.

- ఆమదాలవలస: ఈనాడు సంస్థల అధినేత రామో జీరావు మరణం తీరని లోటని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ శ నివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే ఎటువంటి విజయాన్ని అయినా సాధించ వచ్చునని చెప్పడానికి రామోజీరావు జీవితం ఒక ఉదాహణగా నిలుస్తుందన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే రామోజీరావు మృతిపై పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, సువ్వారి గాంధీ సంతాపం తెలిపారు.

- పొందూరు: రామోజీరావు మరణం పత్రికా లోకానికి తీరని లోటని టీడీపీ నాయకులు అన్నారు. మండల కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో శనివారం రామోజీరావు చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర భాస్కర్‌, పట్టణ అధ్యక్షుడు ఎ.చినరంగ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద రామో జీ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

- అరసవల్లి: రామోజీరావు మృతి బాధాకరమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక విశాఖ-ఏ కాలనీలో గల ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నేత లతో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, అంబటి లక్ష్మీరాజ్యం, కవ్వాడి సుశీల, డివిజన్‌ ఇన్‌చార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే రామోజీరావు మరణంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు కల మట వెంకటరమణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- రణస్థలం: ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రా మోజీరావు మృతికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన స్థాని క విలేకరులతో మాట్లాడుతూ.. రామోజీ ఇక లేరని తెలిసి ఎం తో బాధపడ్డానన్నారు. భావితరాలకు రామోజీ సేవలు తెలి యాలని, ఇందుకనుగుణంగా రణస్థలంలోని తన డిగ్రీ కళాశా ల ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.

- గార: రామోజీరావు మృతిపై పలువురు టీడీపీ నా యకులు సంతాపం వ్యక్తం చేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ పీస వెంకట రమణ మూర్తి, నాయకులు బడగల వెంకట అ ప్పారావు, గుండ భాస్కరరావు, గొండు వెంకట రమణమూర్తి, కె.ఆదినారాయణ, మళ్ల అబ్బాయినాయుడు, మళ్ల నర్సింగరావు, అరవల పెద్దబాబు, కైబాడి రాజు, మైగాపు ప్రభాకరరావు, గోర సురేష్‌, గిరి కోరాడ వెంకటరావు, పి.కృష్ణమూర్తి, ఎల్‌.రాధాకృష్ణ రెడ్డి, పి.వైకుంఠరావు, జేసీ దేవదాస్‌, కె.జగదీష్‌, శిమ్మ శ్రీనివాస్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

- అరసవల్లి: రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆవేదన వ్య క్తం చేశారు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో తాను అడు గుపెట్టిన అన్ని రంగాల్లో గొప్ప విజయాలను నమోదు చేసిన గొప్ప దార్శినికుడని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అలాగే రామోజీ మృతిపై ఏపీ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ అదపాక సత్యారావు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామోజీరావుతో తనకు గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

- రణస్థలం: రామోజీరావు మృతికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) క్యాంప్‌ కార్యాలయంలో శనివారం సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే తనయుడు తేజ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పాల్గొని రామోజీరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- నరసన్నపేట/పోలాకి: రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నా రు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం రామోజీరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు శిమ్మ చంద్రశేఖర్‌, సూరపు నా రాయణదాసు, సాసుపల్లి కృష్ణబాబు, ఉణ్న వెంకటేశ్వరరావు, కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పట్టణానికి చెందిన శిల్పి వీఎస్‌ఎన్‌ఎన్‌ ఆచారి పెన్సిల్‌ ముల్లుపై రా మోజీరావు చిత్రం గీచి నివాళులర్పించారు.

- ఎల్‌ఎన్‌ పేట: రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరనిలోటని టీడీపీ నాయకులు కె.కృష్ణమాచారి, కె.మన్మథ రావు, సీహెచ్‌ శ్రీని వాసరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాల యంలో శనివారం రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు ఎం.మనోహర్‌నాయుడు, కె.తిరుపతిరావు, జి.మోహనరావు, ఎస్‌.మోహనరావు, ఎ.పోలి నాయుడు, టి.అప్పన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

- కొత్తూరు: రామోజీరావు మరణంపై మండల టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు. శనివారం పార్టీ కార్యాల యంలో రామోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. పార్టీ నాయకులు లోతుగెడ్డ తులసీవర ప్ర సాదరావు, అగతముడి బైరాగినాయుడు, ఎద్దు దాసునాయు డు, రేగేటి కన్నయ్యస్వామి, మాతల గాంధీ, కొయిలాపు శ్రీని వాసరావు, రాజు, వెంకటరమణ, వెంకటకృష్ణ, పడాల నాగభూషణం, దుప్పల వాసు, విక్రమ్‌ తదితరులు ఉన్నారు.

- పాతపట్నం: పత్రికా రంగానికి రామోజీ చేసిప సేవలు మార్గదర్శకంగా నిలిచిపోతాయని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో రామోజీరావు మృతికి సంతాప సభను పార్టీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామో జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

- మెళియాపుట్టి: రామోజీ మృతి మండలంలోని టీడీ పీ, జనసేన, బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. శని వారం టీడీపీ కార్యాలయంలో రామోజీకి నివాళులర్పించి ఆ యన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు సలాన మోహన్‌రావు, ఆనపాన రాజశేఖర్‌రెడ్డి, నంబాల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

- సంతబొమ్మాళి: తెలుగునాట అక్షర యోధుడు రామోజీ అని మండల టీడీపీ అధ్యక్షుడు జీరు భీమారావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మృతికి సంతాపం తెలిపారు. సంతబొమ్మాళి, బోరుభద్రలో రామోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిదపాన ధర్మార్జునరెడ్డి, నాయకులు కూశెట్టి భానుప్రకాష్‌, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

- టెక్కలి: ఈనాడు సంస్థల చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు మృతిపై టెక్కలి టీడీపీ నాయకులు శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రామోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు రామకృష్ణ, నాయకులు కోళ్ల లవకుమార్‌, పోలాకి చంద్రశేఖర్‌, మళ్ల బాలకృష్ణ, గురువెల్లి చిన్నమనాయుడు, దల్లి ప్రసాద్‌రెడ్డి, రెయ్యి ప్రీతీష్‌, మెండ దమయంతి, ఇప్పిలి జగదీష్‌, దోని బుజ్జి, కూరాకుల యాదవ్‌ తదితరులు ఉన్నారు.

- జలుమూరు (సారవకోట): రామోజీరావు అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటని మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. సారవకోట మండలం గుమ్మపాడు గ్రామంలో శనివారం రామోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కత్తిరి ఈశ్వరరావు, నవీన్‌, లంక రామారావు, కరజాన ప్రకాష్‌, బీసింగి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

- హిరమండలం: రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటని జడ్పీటీసీ పి.బుచ్చిబాబు అన్నారు. హిరమండలంలో శనివారం రామోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జి.కామేశ్వరావు, తేజ, మిన్నారావు తదితరులు ఉన్నారు.

- హరిపురం: రామోజీ మృతికి మందస మండలం హ రిపురంలో శనివారం ఘన నివాళులర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. అనం తరం ఆయన సమాజ అభివృద్ధికి చేసిన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏర్పుల జోగారావు, పుల్లా వాసు, బైరశెట్టి గున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:44 PM