Share News

వలంటీర్‌ వ్యవహార శైలిపై వృద్ధుల ఆందోళన

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:40 PM

పెద్దలవునిపల్లి పంచాయతీ చిన్నలవునిపల్లికి చెందిన వృద్ధ దంపతులు వలంటీర్‌ వ్యవహార శైలిపై ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా పాలు పంచుకోవడంతో అది బుధవారం వైరలైంది.

వలంటీర్‌ వ్యవహార శైలిపై వృద్ధుల ఆందోళన

నందిగాం: పెద్దలవునిపల్లి పంచాయతీ చిన్నలవునిపల్లికి చెందిన వృద్ధ దంపతులు వలంటీర్‌ వ్యవహార శైలిపై ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా పాలు పంచుకోవడంతో అది బుధవారం వైరలైంది. వివరాలిలా ఉన్నా యి.. దట్టి ఎండమ్మ, కరువులు గ్రామంలో నివాసముంటు న్నారు. అయితే వీరికి తాగునీరు అందక ఏడవడంతో సర్పంచ్‌ స్పందించి ట్యాప్‌లు ఏర్పాటు చేశారు. అయితే ట్యాప్‌ నుంచి నీరు రాకపోవడంతో ‘ఇది ఎందుకు దండగ’ అంటూ బాధపడి కొళాయిని నెట్టివేశారు. ఈ నేపథ్యంలో అక్కడి వలంటీర్‌ చంపేస్తాను.. తంతానంటూ భయభ్రాంతులకు గురి చేయడం తో మాకెవరు దిక్కని వాపోయారు. దీనిపై పంచాయతీ కార్య దర్శి స్వాతిని వివరణ కోరగా వృద్ధ దంపతులను వలంటీర్‌ దుర్భాష ఆడలేదని, ట్యాప్‌ పాడు చేయడంతో అలా ఎందుకు చేశారని మందలించారన్నారు. సమస్యను పరిష్కరించి వారికి నీరు అందిం చేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:40 PM