Share News

15లోగా పన్ను వసూళ్లు పూర్తిచేయండి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:49 PM

ప్రజలు వడ్డీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 15లోగా పన్నులను చెల్లించేలా అధికారులుచర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నగరపాలక కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోసచివాలయ అడ్మిన్‌ సెక్రటరీలతో పన్ను చెల్లింపులపై కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్‌ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుపై వడ్డీ రాయితీ ఇచ్చిన నేపధ్యంలో ఈనెల 31లోగా ఇంటి పన్నులను చెల్లించి వడ్డీ మినహాయింపు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.వాణిజ్య, వ్యాపార వర్గాలకు అవగాహన కల్పించాలని, పెద్ద మొత్తంలో పాత పన్నులు కూడా చెల్లించని వారికి నోటీసులివ్వాలని కమిషనర్‌ ఆదేశించారు.

 15లోగా పన్ను వసూళ్లు పూర్తిచేయండి

శ్రీకాకుళం అర్బన్‌: ప్రజలు వడ్డీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 15లోగా పన్నులను చెల్లించేలా అధికారులుచర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నగరపాలక కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోసచివాలయ అడ్మిన్‌ సెక్రటరీలతో పన్ను చెల్లింపులపై కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్‌ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుపై వడ్డీ రాయితీ ఇచ్చిన నేపధ్యంలో ఈనెల 31లోగా ఇంటి పన్నులను చెల్లించి వడ్డీ మినహాయింపు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.వాణిజ్య, వ్యాపార వర్గాలకు అవగాహన కల్పించాలని, పెద్ద మొత్తంలో పాత పన్నులు కూడా చెల్లించని వారికి నోటీసులివ్వాలని కమిషనర్‌ ఆదేశించారు.

చెత్తను తొలగించండి

శ్రీకాకుళంలోని ఆదివారంపేట, తురాయిచెట్టు వీధి, కనకదుర్గ గుడి, వాంబే కాలనీ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలపై వచ్చిన ఫిర్యాధుల మేరకు శుక్రవారం కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిపై మండిపడ్డారు. డైనేజ్‌ అవుట్‌లెట్ల వద్ద చెత్తను తొలగించాలని పారిశుధ్య కార్మి కులకు ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికా రులకు ఆదేశించారు. ఆమె వెంట ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బంది పి.గణపతి,పి.సుగుణాకర్‌ తదితరులు ఉన్నారు.

రిజర్వ్‌ స్థలాల్లో పార్క్‌లు నిర్మించండి

శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళంలోని శాంతినగర్‌కాలనీలో గల రిజర్వ్‌స్థలంలో పార్క్‌లు నిర్మించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు గంగుశ్రీదేవి, నాయకులు సాధు కిరణ్‌కుమార్‌, పురుషోత్తం, అప్పారావు కోరారు.ఈమేరకు శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని పలు సమస్యలపై కమిషనర్‌ తమీమ్‌ అన్సారియాకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆర్ట్స్‌కళాశాల రోడ్డులో ఆర్చ్‌నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు. ఈ రోడ్డులో ఆర్చి నిర్మాణం జరగడం వల్ల 100 అడుగుల రోడ్డు 50 అడుగుల కు తగ్గిపోతుందని కమిషనర్‌కు బీజేపీ నాయకులు వివరించారు. వేసవి సమీపి స్తుండడంతో తాగు నీటి సమస్య తలెత్తకుండా సబ్‌ సర్ఫేస్‌ డైక్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.

Updated Date - Mar 01 , 2024 | 11:49 PM