Share News

Muggu పాఠశాలల్లో ముగ్గుల పోటీ

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:47 PM

Muggu కొత్తసంవత్సరం వేడుకల్లో భాగంగా ఉర్లాం ఉన్నత పాఠశాలలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు.

Muggu పాఠశాలల్లో ముగ్గుల పోటీ
ఉర్లాం పాఠశాలలో ముగ్గు వేస్తున్న విద్యార్ధినులు

నరసన్నపేట, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): కొత్తసంవత్సరం వేడుకల్లో భాగంగా ఉర్లాం ఉన్నత పాఠశాలలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. అలాగే పలు పాఠశాలలు, విద్యాసంస్ధలలో కొత్తసంవత్సర ముందుస్తు వేడుకులను మంగళవారం ఆనందోత్సాహాల నడుమ చేపట్టారు.

జలుమూరులో..

జలుమూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలం పలు పాఠశాలల్లో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ముందస్తుగా పాఠశాలల్లో విద్యార్ధులకు రంగవల్లి, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. బసివాడ ప్రాథమికోన్నత, కరవంజ, యలమంచిలి ఉన్నతపాఠశాల, గుగ్గిలి, ప్రాథమిక పాఠశాలల్లో ఈ వేడుకలు జరిగాయి.

Updated Date - Dec 31 , 2024 | 11:47 PM