Share News

మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరికి కలెక్టర్‌ అభినందన

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:07 AM

అధికారులు, సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించి, జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరిని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అభినందించారు. ఎన్నికల పరిశీలకులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాన్ని గురువారం తన కార్యాలయంలో ఉపాధ్యాయుడైన శేషగిరికి అందజేశారు. విజయవాడలో శిక్షణ పొందిన ఆయన ఎన్నికల నియమాలు, విధులపై గత నాలుగు నెలలుగా అధికారులు, సిబ్బందికి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. ఆయనను అభినందించిన వారిలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ కూడా ఉన్నారు.

మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరికి కలెక్టర్‌ అభినందన
మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరిని అభినందిస్తున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌:

కలెక్టరేట్‌: అధికారులు, సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించి, జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరిని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అభినందించారు. ఎన్నికల పరిశీలకులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాన్ని గురువారం తన కార్యాలయంలో ఉపాధ్యాయుడైన శేషగిరికి అందజేశారు. విజయవాడలో శిక్షణ పొందిన ఆయన ఎన్నికల నియమాలు, విధులపై గత నాలుగు నెలలుగా అధికారులు, సిబ్బందికి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. ఆయనను అభినందించిన వారిలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ కూడా ఉన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:07 AM