జిల్లాకు చేరుకున్న కలెక్టర్
ABN , Publish Date - Feb 01 , 2024 | 11:45 PM
కొత్త కలెక్టర్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమి షనర్ గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్‌గా మన్‌జీర్ జిలానీ సమూన్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్‌గా.. ఆయన సతీమణి తమీమ్ అన్సారియా నియమి తులైన విషయం తెలిసిందే.
- కార్పొరేషన్ కమిషనర్ కూడా..
శ్రీకాకుళం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కొత్త కలెక్టర్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమి షనర్ గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్‌గా మన్‌జీర్ జిలానీ సమూన్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్‌గా.. ఆయన సతీమణి తమీమ్ అన్సారియా నియమి తులైన విషయం తెలిసిందే. ఈ మేరకు వారిద్దరూ గురువారం శ్రీకాకుళం చేరుకోగా.. జిల్లా అధికారులు స్వాగతం పలికారు. జేసీ నవీన్, ఎస్పీ రాధిక, జిల్లా రెవెన్యూ అధి కారి ఎం.గణపతిరావు, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధికారులు, జిల్లా సమాచార శాఖ అధికారులు కలెక్టర్‌ను, కమిషనర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
సుడా వైస్ చైర్మన్‌గా ఓబులేసు
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన చల్లా ఓబులేసును శ్రీకాకుళం అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ(సుడా) వైస్ చైర్మన్‌గా నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.