అంగన్‌వాడీల కోటి సంతకాల సేకరణ
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:55 PM
సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సమ్మెలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళంలోని జ్యోతిబాపూలే పార్కు వద్ద నిర్వహించిన శిబిరంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు.

అరసవల్లి, జనవరి 12: సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సమ్మెలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళంలోని జ్యోతిబాపూలే పార్కు వద్ద నిర్వహించిన శిబిరంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి మాట్లాడుతూ.. సేకరించిన సంతకాలను సీఎం జగన్మోహన్‌రెడ్డికి పంపిస్తామని తెలిపారు. 32 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గ్రాట్యుటీ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకపోవడం అన్యాయమని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలు, చలో విజయవాడ చేపడతామని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వీజీకే మూర్తి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు కె.లక్ష్మి, హేమలత, రాజేశ్వరి పాల్గొన్నారు.