Share News

సీఎం జగన్‌ అప్పుల అప్పారావు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:19 PM

సీఎం జగన్మోహన్‌ రెడ్డి అప్పుల అప్పా రావుగా మారాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. శనివారం రాత్రి మర్రిపాడులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

సీఎం జగన్‌ అప్పుల అప్పారావు
వైసీపీ నేత అట్టాడ రాంప్రసాద్‌కు కండువా వేసి ఆహ్వానిస్తున్న అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, జనవరి 6: సీఎం జగన్మోహన్‌ రెడ్డి అప్పుల అప్పా రావుగా మారాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. శనివారం రాత్రి మర్రిపాడులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 36 మంగళవారాలకు గాను 34 వారాలు అప్పు కోసం రిజ్వర్‌ బ్యాంక్‌ చుట్టూ తిరిగాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటి వరకు రూ.13 లక్షల కోట్లు అప్పులు చేశాడన్నారు. సమస్యల సాధన కోసం అంగన్‌వాడీలు, ఎస్‌ఎస్‌ఏ, మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారని, రాష్ట్రా ఆందోళనాంధ్రప్రదేశ్‌గా సీఎం మార్చా డని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు 703 హామీలిచ్చి వాటిలో కేవలం 73 మాత్రమే నెరవేర్చాడన్నారు. మర్రిపాడు, భావనపాడు, దేవునల్తాడ పంచాయతీలో మూడేళ్లుగా వంశధార నీరు రాక పంటలు ఎండ పోయినా కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో సాగునీరందేలా చర్యలు తీసుకొన్నామని, ప్రకృతి కన్నెర చేస్తే కరువు మండలాలుగా ప్రకటించామని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమా రావు, రెడ్డి అప్పన్న, కింజరాపు హరిప్రసాద్‌, మెండ దాసు నాయుడు, బోయిన రమేష్‌, బగాది శేషగిరి, వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:19 PM