Share News

టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కొట్లాట

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:20 AM

శ్రీకాకుళం మండలం భైరివానిపేటలో టీడీపీ, వైసీపీ వర్గా ల మధ్య శుక్రవారం రాత్రి కొట్లాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలు కాగా.. రిమ్స్‌కు తరలించారు.

టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కొట్లాట

శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళం మండలం భైరివానిపేటలో టీడీపీ, వైసీపీ వర్గా ల మధ్య శుక్రవారం రాత్రి కొట్లాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలు కాగా.. రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనకు సం బంధించి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భైరివానిపేటకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు సర్పంచ్‌ భైరి నరేష్‌.. శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై తన గ్రామంలోకి వస్తుండగా.. వైసీపీకి చెందిన సిమ్మ అప్పన్న అ డ్డగించాడు. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమిపాలు కావ డంతో.. ‘నీ అంతు తేలుస్తా’నంటూ నరేష్‌తో అప్పన్న గొడవకు దిగాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ నరేష్‌ సోదరుడు వెంకటేష్‌.. ఆయన మిత్రులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ఎన్నికలు ముగిసాయని.. ఇటువంటి గొడవలు ఇక తగదని వారించాడు. అప్పటికే అప్పన్న వర్గీయులు కూడా అక్కడకు చేరుకుని సర్పంచ్‌ నరేష్‌, ఆయన సోదరుడు వెంకటేష్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చేసుకోవడంతో టీడీపీకి చెందిన నరేష్‌, వెంకటేష్‌ తోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే వైసీపీ వర్గానికి చెందిన ము గ్గురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని రూరల్‌ ఎస్‌ఐ వాసుదేవరావు, శ్రీకాకుళం సీఐ ఎల్‌.సన్యాసిరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వాసుదేవరావు తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 12:20 AM