Share News

వైసీపీ మహిళా జిల్లా అధ్యక్ష పదవికి చింతాడ మంజు రాజీనామా

ABN , Publish Date - Aug 23 , 2024 | 11:47 PM

వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు రాజీనామా పత్రాలు పంపినట్లు ఆమె విలేకరులకు తెలిపారు.

వైసీపీ మహిళా జిల్లా అధ్యక్ష పదవికి చింతాడ మంజు రాజీనామా
చింతాడ మంజు

టెక్కలి, ఆగస్టు 23: వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు రాజీనామా పత్రాలు పంపినట్లు ఆమె విలేకరులకు తెలిపారు. పార్టీలో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలు దృష్ట్యా తన పదవికి రాజీనామా చేశానన్నారు. ఇదిలా ఉండగా.. టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కేటాయించలేదనే అసంతృప్తితో చింతాడ మంజు.. తన పదవికి రాజీనామా చేశారని కార్యకర్తల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను గురువారం అధిష్ఠానం తొలగించింది. పేరాడ తిలక్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న మంజుకు నిరాశ ఎదురవడంతో.. రాజీనామా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈమె భర్త చింతాడ గణపతిరావు వైసీపీలో క్రియాశీలక రాజకీయాలు నిర్వహించేవారు.

Updated Date - Aug 23 , 2024 | 11:47 PM