బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:42 PM
బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని, దీనిని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జూనియర్ సివిల్ న్యా యాధికారి ఎస్‌హెచ్‌ఆర్ మల్లా తేజా చక్రవర్తి అన్నారు.

టెక్కలి: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని, దీనిని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జూనియర్ సివిల్ న్యా యాధికారి ఎస్‌హెచ్‌ఆర్ మల్లా తేజా చక్రవర్తి అన్నారు. బుధ వారం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ సిబ్బందితో న్యాయ విజ్ఞా న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, బాలబాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు పాటించకుంటే శిక్షలు విధించబడతాయన్నారు. 14 ఏళ్ల లోపు బాలబాలికలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య అందిస్తోందని, ప్రతి ఒక్క రూ చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివ్వల వివేకానంద, ఎంపీడీవో కె.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎల్.ఎన్.పేట: బాల కార్మికులు లేని సమాజం తయార వ్వాలని దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సక్షం సంస్థ జిల్లా కన్వీనర్ మన్మథకుమార్ మిశ్రో అన్నారు. తెలి పారు. ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినం సంద ర్భంగా లక్ష్మీనర్సుపేటలో బుధవారం గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.బృం దావనరావు, ఐ.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.