Share News

శిలాఫలకం మార్చండి

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:44 PM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ 24వ వార్డులో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నూతన గదుల ప్రారంభోత్సవంలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వ లేదని మునిసిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పభుత్వ ఆసుపత్రి సందర్శించారు.

శిలాఫలకం మార్చండి

పలాస, ఫిబ్రవరి 1: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ 24వ వార్డులో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నూతన గదుల ప్రారంభోత్సవంలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వ లేదని మునిసిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పభుత్వ ఆసుపత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిలాఫలకంలో తన పేరును ఉద్దేశపూర్వకంగానే వెనుక పెట్టారని, దీని ని సరిచేసి, కొత్త శిలాఫలకం ఏర్పాటు చేయాలని, లేకుంటే తాను చట్టపరంగా చర్యలు తీసు కుం టానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హాజరుపట్టీని పరిశీలించారు. అయితే 11 మంది వైద్యా ధికా రులు ఉండాల్సి ఉండగా పలువురు వైద్యులు బయట పనుల నిమిత్తం వెళ్లడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మునిసిపాలిటీ ప్రథ మ పౌరుడినని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్న తనకు గడచిన మూడేళ్లలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆసుపత్రి అభివృద్ధి నిధుల ఖర్చుల వివరాలను సహచట్టం ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట మంత్రి అప్పలరాజు ఆసుపత్రి అదనపు భవనాలను ప్రారంభించిన సందర్భంగా చైర్మన్‌ పేరు వెనుక వరుసలో ఉండడాన్ని గుర్తించి ఆయన ప్రశ్నించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించి అందులో ఉన్న లోపాలు ప్రజలకు బహిర్గతం చేసేందుకు చైర్మన్‌ చర్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - Feb 01 , 2024 | 11:44 PM