Share News

మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర సాయం

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:14 PM

మత్స్యకారుల అభ్యు న్నతికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర మత్స్య, పాడి పరి శ్రమ శాఖా మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.

మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర సాయం
మాట్లాడుతున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల

- కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల

ఎచ్చెర్ల, జనవరి 6: మత్స్యకారుల అభ్యు న్నతికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర మత్స్య, పాడి పరి శ్రమ శాఖా మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. బుడగట్లపాలెంలో శనివారం సాగర్‌ పరిక్రమ్‌ 10వ విడత కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో నిర్మిం చనున్న ఫిషింగ్‌ హార్బర్‌ స్థలాన్ని పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమం కోసం హార్బర్లు, జెట్టీలను, ఫిషింగ్‌ వినియోగపడే పరికరాలను మంజూరు చేస్తున్నామన్నారు. కేంద్ర సహాయమంత్రి ఎల్‌. మురుగున్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా ఏడు వేల కిలో మీటర్ల పరిధి లోని మత్స్యకార ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. ఈ సంద ర్భంగా 215 మంది మత్స్యకారులకు రూ.1.01కోట్లు కిసాన్‌ క్రెడిట్‌ రుణాల చెక్కులు అందజే శారు. 147 ఫిషింగ్‌ విక్రయ శాలల ఏర్పాటుకు రూ.81.2 లక్షల మేర రాయితీ నిధులను అందజే శారు. ఎచ్చెర్ల మండ లంలో మూడు పం చాయతీల్లో 200 మందితో మత్స్యకారుల ప్రాథమిక ఉత్పత్తిదారుల సంఘానికి రిజిస్ట్రేషన్‌ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ ప్రసాద్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, ఎంపీపీ మొదలవలస చిరంజీవి, శ్రీకాకుళం, విజయగనరం బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వర రావు, నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:14 PM