Daadi మహిళపై దాడి చేసిన వ్యక్తులపై కేసు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:00 AM
Daadi శ్రీకాకుళంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు.

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీకాకుళం లోని టౌన్‌హాల్ సందులోని ఓ కల్యాణ మండపంలో శుభకార్యానికి లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన లింగాల అప్పమ్మ తన చెల్లెలి కుమా రుడితో ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వచ్చింది. అదే సమయంలో నగరానికి చెందిన ఎండి సల్మాన్, ఎర్రయ్య ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తున్నారు. వారిద్దరూ మద్యం మత్తులో కిందపడిపోయారు. తాము పడిపోవడా నికి అప్పమ్మ, ఆమె చెల్లెలు కొడుకే కారణమని వారిద్దరిని చేతికి వేసుకునే కడియంతో కొట్టారు. దీంతో అప్పమ్మకు కుడి కంటి కింది భాగంలో తీవ్ర గాయం కావడంతో ఆమెను స్థానికులు ఆటోలో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అప్పమ్మ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం దాడికి పాల్పడిన సల్మాన్, ఎర్రయ్యలపై వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ కేసు నమోదు చేశారు.
పుట్టినరోజు వేడుకల్లో వివాదం
కొత్తూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పారాపురం గ్రామంలో ఆదివారం ఓ పుట్టిన రోజు వేడుకల్లో వివాదం జరిగింది. ఈ నేపథ్యం లో మరలా సోమవారం వాగ్వాదం జరిగి ఒక యువకుడు దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పైల శ్రీను పుట్టిన రోజు వేడుక సమయంలో కేక్ కట్ చేస్తుండగా జీవన్‌కుమార్ ఫోం స్ర్పే కొట్టాడు. దీంతో దుక్క సాయి కుమార్ అతడిని వారించగా వివాదం జరిగి సద్దుమణిగింది. సోమ వారం మధ్యా హ్నం పారాపురం సచివాలయం వద్ద మళ్లీ వాగ్వాదం జరగ్గా జంప జీవన్ కుమా ర్ సాయికుమార్‌పై కీచైన్‌తో దాడిచేశాడు. ఈ నేపథ్యంలో గాయ పడిన సాయి కుమార్ కొత్తూరు సామాజిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు జీవన్ కుమార్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
హరిపురం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మందస మండలం రంగోయి గేటు- మఖరజోల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయా లయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సువర్ణాపురం గ్రామానికి చెందిన ఎ.పోతయ్య ఆదివారం రాత్రి బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు ఒక చేయి, ఒక కాలుగు విరిగి నుజ్జునుజ్జయింది. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందగా మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.