వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:36 PM
ఎండలు తీవ్రతరం అవుతున్నందున ఉపాధి వేతనదారులు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐకేపీ పీడీ కూర్మారావు తెలిపారు. బుధవారం మునగ వలస పంచాయతీలో మహిళా సంఘాలకు ఓటు హక్కు వినియోగించడంతో పాటు వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఆమదాలవలస: ఎండలు తీవ్రతరం అవుతున్నందున ఉపాధి వేతనదారులు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐకేపీ పీడీ కూర్మారావు తెలిపారు. బుధవారం మునగ వలస పంచాయతీలో మహిళా సంఘాలకు ఓటు హక్కు వినియోగించడంతో పాటు వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులు, పాడి రైతులు ఖాళీ ప్రదేశాల్లో చెట్ల కింద ఉండాలన్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన మహిళలు, ఉపాధి హామీ కూలీలు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్ వాడడంతో పాటు వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ఇచ్ఛాపురం: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపడు తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ తెలిపారు. నీటి ఎద్దడి నివారణలో భాగంగా బుధవారం బాహుదానదిలో రివర్ బండ్‌ను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించారు. నదిలో అడ్డుకట్టు వేసి నీరు వృథాగా పోకుండా నిల్వ చేసేందుకు పనులు చేపడుతున్నామని తెలిపారు. కమిషనర్‌తోపాటు ఏఈ కామేశ్వరరావు తదితరులు ఉన్నారు.