Share News

ప్రసవ వేదన పట్టించుకోలే..

ABN , Publish Date - May 29 , 2024 | 11:41 PM

ప్రసవానికి పీహెచ్‌సీకి వచ్చిన గర్భిణికి వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురైన ఘటన బుధవారం నౌపడాలో జరిగింది.

ప్రసవ వేదన పట్టించుకోలే..
పురిటి నొప్పులతో వైద్యం కోసం ఎదురుచూస్తున్న గర్భిణి

వైద్యులు లేక అందని సేవలు

పురిటి నొప్పులు, రక్తస్రావంతో ఇబ్బందిపడిన గర్భిణి

108లో టెక్కలి ఆసుపత్రికి తరలింపు

సంతబొమ్మాళి, మే 29: ప్రసవానికి పీహెచ్‌సీకి వచ్చిన గర్భిణికి వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురైన ఘటన బుధవారం నౌపడాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నౌపడా గ్రామానికి చెందిన దుక్క చిన్నమ్మి బుధవారం సాయంత్రం ప్రసవం నిమిత్తం పురిటి నొప్పులతో నౌపడా పీహెచ్‌సీకి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆశ కార్యకర్త తప్ప వైద్య సిబ్బంది, వైద్యులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. పరీ క్షించి రిఫర్‌ చేసేందుకు వైద్యులు లేకపోవడంపై గర్భిణి బం ధువులు ఆవేదన వ్యక్తంచేశారు. 24 గంటలు సేవలందిం చాల్సిన పీహెచ్‌సీల్లో ఇటువంటి పరిస్థితి ఉండడంపై వారు ఆగ్రహం చెందారు. ఒక పక్క రక్తస్రావం, మరో పక్క పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందలేదని.. ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. గర్భిణికి రక్తస్రావం ఎక్కువవడంతో వెంటనే బంధువులు 108కి ఫోన్‌ చేసి టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలిం చారు. పీహెచ్‌సీలో వైద్యులున్నా ఓపీలు చూడడం లేదని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది లేరని, టెక్కలి వెళ్లిపోవా లని ఆశ కార్యకర్తతో ఫోన్‌లో సలహా ఇవ్వ డంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై నౌపడ పీహెచ్‌సీ వైద్యా ధికారి పరిమళను వివరణ కోరగా సిబ్బంది కొరత వల్ల ఆ సమయంలో ఎవరూ లేరని, తర్వాత స్టాఫ్‌నర్సును పంపామన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:41 PM