Share News

అభ్యర్థుల ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:55 PM

నామినేషన్ల ప్రక్రియ ప్రార ంభమైన రోజు నుంచే అభ్యర్థుల ప్రచారం ఖర్చులు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆధికారులను ఆదేశించారు.

అభ్యర్థుల ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి

- కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌: నామినేషన్ల ప్రక్రియ ప్రార ంభమైన రోజు నుంచే అభ్యర్థుల ప్రచారం ఖర్చులు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్వోలు, నోడల్‌ అధికారులతో మంగళవా రం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అభ్యర్థి నామినేషన్‌ వేసిన దగ్గర నుంచీ పక్కాగా ఖర్చులు నమోదు చేయాలి, సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, జెండా లు, బ్యానర్లు, పోస్టర్లు, వినియోగిస్తున్న వాహనాలు, ఏజెంట్లకు పెట్టే భోజనాల ఖర్చులు సైతం అభ్యర్థి ఖాతాలో నమోదు చేయాన్నారు. పార్లమెంటు, అసెం బ్లీ అభ్యర్థులు ఇద్దరూ ఉమ్మడిగా సభలు, సమావే శాలు నిర్వహిస్తే ఆ ఖర్చును ఇద్దరికీ సర్దుబాటు చేయాన్నారు. జిల్లాకు ముగ్గురు ఐఆర్‌ఎస్‌ అధికారు లను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్‌ నియమించిందని, ఒకరు పార్లమెంట్‌కు, మిగిలిన ఇద్దరు అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారన్నారు. సభలు, సమా వేశాలు జరిగిన 24 గంటల్లోగానే అభ్యర్థి ఖాతాలో ఖర్చు నమోదు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్‌లో జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్వోలు పాల్గొన్నారు.

నామినేషన్ల స్వీకరణకు సిద్ధంకండి

కలెక్టరేట్‌: సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి స్వీకరించేం దుకు రిటర్నింగ్‌ అధికారులందరూ సిద్ధంగా ఉండా లని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వి జయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో ఆ యన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నామినేష న్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిస్ట్రిబ్యూ షన్‌ సెంటర్స్‌, రోజువారీ నివేదికల పంపిణీ, ఏపిక్‌ కార్డుల జనరేషన్‌, సీజర్‌ మేనేజ్‌మెంట్‌ రిపోర్టు తది తర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌, జేసీ నవీన్‌, డీఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:55 PM