Share News

సముద్రంలో తెప్పబోల్తా

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:22 PM

సముద్రంలో చేపలవేటకు వెళ్లి.. తెప్పబోల్తా పడిన ఘటనలో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు.

 సముద్రంలో తెప్పబోల్తా
మూగి ఎర్రయ్య (ఫైల్‌)

మత్స్యకారుడి మృతి

ఎచ్చెర్ల, జూన్‌ 7: సముద్రంలో చేపలవేటకు వెళ్లి.. తెప్పబోల్తా పడిన ఘటనలో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. పోలీసులు.. స్థానికుల వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మూగి ఎర్రయ్య(59) శుక్రవారం చేపల వేటకు వెళ్లి తెప్ప బోల్తా పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఎర్రయ్యతో పాటు ఇదే గ్రామానికి చెందిన గుంటు కొండయ్య, మూగి రాజప్పడు శుక్రవారం వేకువజామున సముద్రంలో తెప్పపై చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి ఒడ్డుకు చేరే క్రమంలో అలల తాకిడికి తెప్ప బోల్తా పడింది. ముగ్గురూ సముద్రపు నీటిలో పడగా.. కొండయ్య, రాజప్పడు వెంటనే తేరుకుని తెప్పను అందుకున్నారు. ఎర్రయ్య మాత్రం గాయపడి నీటిని అధికంగా తాగేసి.. ఒడ్డుకు చేరేసరికి మృతిచెందాడు. మృతుడి భార్య కాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:22 PM