Share News

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - May 24 , 2024 | 11:24 PM

పట్టణంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారు జామున స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభమై వివిధ కార్యక్రమాలను రుత్వికులు నిర్వహిస్తున్నారు. బహుళ పాడ్యమిని పురస్కరించుకుని శుక్రవారం ఉత్సవ మూర్తు లకు స్నపన తిరుమంజనం, అభిషేకాలను చేపట్టారు.

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
సింహవాహనంపై శ్రీనివాసుని తిరువీధి

సింహ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి

నరసన్నపేట: పట్టణంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారు జామున స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభమై వివిధ కార్యక్రమాలను రుత్వికులు నిర్వహిస్తున్నారు. బహుళ పాడ్యమిని పురస్కరించుకుని శుక్రవారం ఉత్సవ మూర్తు లకు స్నపన తిరుమంజనం, అభిషేకాలను చేపట్టారు. అనంతరం స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమి చ్చారు. పట్టణంలోని ప్రధాన మార్గంతో పాటు ఇతర వీధుల్లోనూ స్వామి వారి తిరువీధి మహో త్సవం కన్నుల పండువగా సాగింది. మహిళల కోలాటం, భరతనాట్య ప్రదర్శనలు, తప్పెటగుళ్లు, భజనలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణం కిటకిటలాడింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు చామర్తి కృష్ణమాచార్యులు, సత్యవరం రుత్వికులు పాల్గొన్నారు. శనివారం శ్రీనివాసుని కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - May 24 , 2024 | 11:24 PM