ముగిసిన బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:48 PM
మందసలోని వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం ముగి శాయి. గతనెల 28 నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరు గుతున్నాయి.

మందస, మార్చి 6: మందసలోని వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం ముగి శాయి. గతనెల 28 నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరు గుతున్నాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత వాసుదేవునికి భక్తుల సమక్షంలో క్షీరాభిషేకం నిర్వ హించారు. సుప్రభాతసేవతో ప్రారంభమైన పూజలు ప్రాతఃకాల ఆరాధన, నివేదన, గోష్టి, యాగశాలలో ధ్వజారోహణ, విశేష పూజలు చేశారు. త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి ఆలయ ప్రాం గణంలో తీర్ధగోష్ఠి నిర్వహించారు. వాసుదేవుడిని పూజించి జీవితం తరించేలా చేసుకోవాలన్నారు. శ్రీరాముడి జీవిత చరిత్రను భక్తులకు వివరించారు.