Share News

పాముకాటుతో బాలుడి మృతి

ABN , Publish Date - May 21 , 2024 | 11:27 PM

టెక్కలి మండ లంలోని చిన్ననారాయణపురానికి చెందిన బాలుడు పాముకాటుతో మృతిచెందాడు. బంధువుల కథనం మేరకు...చిన్ననారాయ ణపురానికి చెందిన దాసరిమురళి, నిరోషల కుమారుడు సాయి వినీత్‌ (13)గ్రామంలో మంగళవారం తోటివిద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడడానికి వెళ్లాడు. ముళ్లపొదల్లోకి వెళ్లిన బంతిని తీసుకువెళ్లెందుకు వెళ్లిన వినీత్‌ను విష సర్పం కాటేసింది. దీంతో కొద్ది సమయానికే వినీత్‌ సృహా కొల్పేవడంతో తల్లిదండ్రులు టెక్కలి జిల్లా ఆసు పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రిమ్స్‌కు రిఫర్‌చేశారు. నరసన్నపేట దగ్గరకు వచ్చేసరికి వినీత్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నరసన్నపేట సామాజిక ఆసుపత్రి లో వినీత్‌ను పరీక్షలు చేయగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు పి.శంకర రావు నిర్ధారించారు. కాగా సకాలంలో వైద్యం అందించకుండా నిండు ప్రాణాలను బలితీసుకున్నారని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతిచెందాడని వినీత్‌ తల్లి నిరోష, బంధువులు ఆరోపించారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా రోదించారు. టెక్కలి ఆసుపత్రి వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినీత్‌ బంధువులు డిమాండ్‌ చేశారు. చిన్న నారాయణ పురంలో విషాధచాయలు అలుముకున్నాయి.

 పాముకాటుతో బాలుడి మృతి
రోదిస్తున్న వినీత్‌ తల్లి నిరోష :

టెక్కలి/నరసన్నపేట: టెక్కలి మండ లంలోని చిన్ననారాయణపురానికి చెందిన బాలుడు పాముకాటుతో మృతిచెందాడు. బంధువుల కథనం మేరకు...చిన్ననారాయ ణపురానికి చెందిన దాసరిమురళి, నిరోషల కుమారుడు సాయి వినీత్‌ (13)గ్రామంలో మంగళవారం తోటివిద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడడానికి వెళ్లాడు. ముళ్లపొదల్లోకి వెళ్లిన బంతిని తీసుకువెళ్లెందుకు వెళ్లిన వినీత్‌ను విష సర్పం కాటేసింది. దీంతో కొద్ది సమయానికే వినీత్‌ సృహా కొల్పేవడంతో తల్లిదండ్రులు టెక్కలి జిల్లా ఆసు పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రిమ్స్‌కు రిఫర్‌చేశారు. నరసన్నపేట దగ్గరకు వచ్చేసరికి వినీత్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నరసన్నపేట సామాజిక ఆసుపత్రి లో వినీత్‌ను పరీక్షలు చేయగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు పి.శంకర రావు నిర్ధారించారు. కాగా సకాలంలో వైద్యం అందించకుండా నిండు ప్రాణాలను బలితీసుకున్నారని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతిచెందాడని వినీత్‌ తల్లి నిరోష, బంధువులు ఆరోపించారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా రోదించారు. టెక్కలి ఆసుపత్రి వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినీత్‌ బంధువులు డిమాండ్‌ చేశారు. చిన్న నారాయణ పురంలో విషాధచాయలు అలుముకున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో..

ఆమదాలవలస: మునిసిపాలిటీ పరిధిలోని బీఆర్‌నగర్‌ సమీపంలో ఉన్న పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. ఈమేరకు సమాచారం ఇవ్వడంతో పోలీసు లు చేరుకుని పరిశీలించారు.అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 11:27 PM