ధైర్యంగా ‘పది’ పరీక్షలు రాయండి: డీఈవో
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:43 PM
పదో తరగతి విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని డీఈవో ఎ.వెంకటేశ్వరావు అన్నా రు. బుధవారం స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు.

నరసన్నపేట: పదో తరగతి విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని డీఈవో ఎ.వెంకటేశ్వరావు అన్నా రు. బుధవారం స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్ర త్తలను వివరించారు. ఉపాధ్యాయులు పరీక్ష గదుల్లో ఏ విధంగా వ్యవహరించాలో తెలిపారు. పరీక్ష కేంద్రా ల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. లిప్ కార్యక్రమంపై సమీక్షించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం రావాలన్నారు. కార్యక్ర మంలో హెచ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా చదవాలి
జలుమూరు: విద్యార్థి దశ నుంచే ప్రణాళికా బద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని హెచ్‌ఎం నక్క కోటిబాబు అన్నారు. పాగోడు ఉన్నతపాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి చదివి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామమూర్తి, జ్యోతి పాల్గొన్నారు.
ఇష్టపడి చదవాలి
దీర్గాశి(పోలాకి): విద్యార్థులు కష్టపడకుండా ఇష్ట పడి చదవాలని పూర్వపు ఎంఈవో పాగోటి తవిట య్య అన్నారు. బుధవారం దీర్గాశి ఉన్నత పాఠ శాల పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహిం చారు. ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాల న్నారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హెచ్‌ఎం ఎస్.శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ మెండ కృష్ణ సుమంగళి, మాజీ సర్పంచ్ సూరిబాబు, విద్యాకమిటీ చైర్‌పర్సన్ పల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు.