Share News

BLOS బీఎల్వోలు బాధ్యతాయుతంగా పనిచేయాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:39 PM

BLOS బూత్‌లెవల్‌ ఆఫీ సర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి అన్నారు.

BLOS బీఎల్వోలు బాధ్యతాయుతంగా పనిచేయాలి
మాట్లాడుతున్న ఆర్డీవో కృష్ణమూర్తి

టెక్కలి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): బూత్‌లెవల్‌ ఆఫీ సర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాల యంలో టెక్కలి, కోటబొమ్మాళి మండలాల బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలోని మృతుల వివరాలు తొలగించడం, కుటుంబం లోని ఓటర్లను ఒకే చోటకు చేర్పించడం, తప్పులను సరిది ద్దడం, భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా ఓటర్ల జాబితా తయారుచేసే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టెక్కలి, కోటబొ మ్మాళి తహసీల్దార్లు సాధు దిలీప్‌ చక్రవర్తి, అప్పలరాజు, డీటీ అనిల్‌కుమార్‌ పాత్రో ఉన్నారు.

సోలార్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు

టెక్కలి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. పీఎం సూర్యాఘర్‌ పథకం కింద సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి పది కిలోవాట్స్‌, ఆర్డీవో నివాసానికి మూడు కిలోవాట్స్‌ సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రతి పాదనలు జరిగాయి. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో విద్యుత్‌ అంతరాయం కలిగినప్పుడు సిస్టమ్స్‌ మొరాయించ డం, సిబ్బంది అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌ అంతరాయం నుంచి గట్టెక్కేందుకు ప్రధాన మంత్రి సూర్యాఘర్‌ పథకం కింద ప్రతిపాదనలు చేశామని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 11:39 PM