Share News

బిల్లుల పెండింగ్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:59 PM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. బిల్లుల చెల్లింపు బాధ్యత చూడాల్సిన ఇంజనీరింగ్‌ అధికారులు ము ఖం చాటేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయా యి. వివరాలిలా ఉన్నాయి.

బిల్లుల పెండింగ్‌

పలాస, ఫిబ్రవరి 13: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. బిల్లుల చెల్లింపు బాధ్యత చూడాల్సిన ఇంజనీరింగ్‌ అధికారులు ము ఖం చాటేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయా యి. వివరాలిలా ఉన్నాయి. మునిసిపాలిటీలోని ఇంజినీరింగ్‌ విభాగంలో ఒక ఏఈ, ఒక డీఈ మాత్రమే ఉన్నారు. 31 వార్డుల్లో అభివృద్ధి పనులను వీరు పర్యవేక్షించాల్సి ఉంది. ఈనెల 3న ఒకరోజు సెలవుపై వెళ్లిన ఏఈ ఇప్పటి వరకు విధులకు రాలేదు. డీఈ 15 రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీనికి ప్రధానంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు చేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. కాంట్రాక్టర్లు సైతం తమ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం, పాలకులు స్పందించక పోవడంతో ఇంజనీరింగ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తమకెం దుకులే అన్నట్లు వారు సెలవుపై వెళ్లారన్న విమర్శలు వినిపి స్తున్నాయి. బకాయిలతో పాటు కొత్తగా అంచనాలు వేసినవి, పరిపాలన ఆమోదం కోరినవి వందల సంఖ్యలో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల చెల్లింపులు లేక పోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సూదికొండ, నెహ్రూ నగర్‌, గాంధీనగర్‌ ప్రాంతా లతో పాటు 31 వార్డుల్లోను అభివృద్ధి పనులకు బ్రేక్‌ ఏర్పడింది. దీంతో పాలక వర్గంపై తీవ్ర వత్తిళ్లు రావడంతో వారు సైతం చేతులు ఎత్తివేస్తు న్నారు. ఈ పరిస్థితి సాక్షాత్తు మంత్రి అప్పలరాజు నియోజక వర్గంలోని మునిసిపాలిటీలో నెలకొనడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మునిసి పల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు వద్ద ప్రస్తావించగా అధికారులు గైర్హాజ రైతే పనులు ఏ విధంగా చేయించగలమని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌ను వివరణ కోరగా తాను ఇప్పటికే సంబం ధిత ఉన్నతాధి కారులకు ఈ వ్యవహారాన్ని చెప్పడం జరిగిందన్నారు. సచివా లయ ఇంజనీరింగ్‌ అధికారులనైనా తాత్కాలికంగా నియ మించాలని కోరామని పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:59 PM