Share News

అడ్డగోలుగా బిల్లులు..ఆదరాబాదరాగా పనులు

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:38 PM

పొందూరు ప్రభుత్వో న్నత పాఠశాలలో నాడు-నేడు పనులు ఆదరాబాదరాగా నిర్వహిస్తున్నారు.

అడ్డగోలుగా బిల్లులు..ఆదరాబాదరాగా పనులు
రోడ్డు పనులు చేస్తున్న దృశ్యం

- నిలిపి వేయించాలని ఎంఈవోకు రవికుమార్‌ ఆదేశం

- కొనసాగించిన హెచ్‌ఎం

పొందూరు: పొందూరు ప్రభుత్వో న్నత పాఠశాలలో నాడు-నేడు పనులు ఆదరాబాదరాగా నిర్వహిస్తున్నారు. ఇ క్కడ నాడు-నేడు పనులకు సంబంధిం చి గతంలో అప్పటి అధికార పార్టీ నా యకుల అండదండలతో అడ్డుగోలుగా బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు ఉన్న విషయం విదితమే. పనులు జరగకపోయినా బిల్లులను మా త్రం సంబంధిత కాంట్రాక్టర్లకు ముందుగానే చెల్లిం చడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఇంతలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాడు-నేడు ప నులను నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. కాని ఇక్కడ ప్రభుత్వోన్నత పాఠశాలలో పను లు జరుగకపోయినా బిల్లులు చెల్లించారన్న ఆరోపణ ల నేపథ్యంలో అక్రమాలు ఎక్కడ బయటపడతా యోనని రెండు రోజులుగా రోడ్డు తదితర పనులను నిర్వహిస్తు న్నారు. సోమవారం పనులు జరగడంపై ఎంఈవో-2కు ఎమ్మెల్యే రవికుమార్‌ పోన్‌చేసి పను లు నిలిపివేయాలని ఆదేశించారు. ఆయన హెచ్‌ఎం కు సూచించినా పనులు జరగడం విశేషం. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయను న్నట్లు ఎంఈవో తెలిపారు.

Updated Date - Jun 10 , 2024 | 11:38 PM