Share News

శతశాతం పాఠశాలల్లో ‘భోజనం’ అమలు చేయాలి

ABN , Publish Date - May 27 , 2024 | 11:57 PM

విద్యార్థులు శతశాతం పాఠశాలల్లో భోజనం పథకం అమలు చే యాలని డీఈవో కె.వెంకటేశ్వరరావు తెలిపారు.

శతశాతం పాఠశాలల్లో ‘భోజనం’ అమలు చేయాలి

జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు

ఇచ్ఛాఫురం: విద్యార్థులు శతశాతం పాఠశాలల్లో భోజనం పథకం అమలు చే యాలని డీఈవో కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇచ్ఛాపురం మండల విద్యాశాఖ కార్యా లయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు గోరుముద్ద పీఎం పోషణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక శిక్షకులు యు. రాము మెనూ తయారుచేసే విధానం ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.అప్పారావు, 69 పాఠ శాలల వంట నిర్వాహకులు, ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

సోంపేట మోడల్‌ పాఠశాలలో..

సోంపేట: ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్య, వర్క్‌ పుస్తకాలు 15,793, నోట్‌పుస్తకాలు 42,180 సిద్ధంగా ఉన్నాయని డీఈవో కె.వెంకటేశ్వరరావు తెలిపా రు. సోమవారం సోంపేట మోడల్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట నిర్వా హకులకు శిక్షణ శిబిరాన్ని, అనంతరం విద్యాకానుక స్టాక్‌ పాయింట్‌ను పరిశీలిం చారు. ఎంఈవోలు ఎస్‌.జోరాడు, జె.కృష్ణంరాజు, సిబ్బంది ఉన్నారు.

లావేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో..

లావేరు: పాఠశాల మధ్యాహ్నం భోజన పఽథకం వంటల్లో మెలుకవలు తెలుసుకోవాలని ఎండీఎం ప్రొగ్రాం కో ఆర్డినేటర్‌ డి.కూర్మారావు అన్నారు. సోమవారం లావేరు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద వంట కార్మికులకు వంటల్లో తెలుసు కోవాల్సిన మెలుకువలు, పాటించాల్సిన జాగ్రత్తలపై ఒక్క రోజు శిక్షణ నిచ్చారు. శిక్షకులు కె.సుశీల, లావేరు ఎంఈవో-2 ఎం.మురళీకృష్ణ, ఎండీఎం, ఏడీ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:57 PM