Share News

పలాసలో పులి దిగింది జాగ్రత్త

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:30 AM

పలాసలో పౌరుషం చూస్తున్నానని, పలాస ఉగ్రరూపం ధాటికి తట్టుకునే శక్తి ఆ దొం గల రాజుకు లేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

పలాసలో పులి దిగింది జాగ్రత్త
మాట్లాడుతున్న ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

పలాస/పలాసరూరల్‌/మందస/వజ్రపుకొత్తూరు/హరిపురం: పలాసలో పౌరుషం చూస్తున్నానని, పలాస ఉగ్రరూపం ధాటికి తట్టుకునే శక్తి ఆ దొం గల రాజుకు లేదని ఎంపీ కింజరాపు రామ్మో హన్‌ నాయుడు అన్నారు. పలాసలో సోమ వారం ప్రజాగళం బహిరంగసభలో ఎంపీ మాట్లాడుతూ.. ప్రజాగళంలో పెద్దపులిగా చంద్రబాబు దిగారని, నక్కలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ఐదేళ్లలో పలాసలో ప్రశాంతత కరువైందని, సాగు, తాగునీరు లేదని, కొండలను మింగారు తప్ప ఏ ఒక్క రికి న్యాయం చేయలేదన్నారు. ప్రస్తుతం పలాసలో ఉద్యోగాలు లేవని, రైతు బజారు, ఇండోర్‌ స్టేడియం లేదని, జీడికి మద్దతు ధర లేక రైతులు రోడ్డున పడ్డారని, మరలా టీడీపీ ప్రభుత్వంలోనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుం దన్నారు. త్రిమూర్తులుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ప్రధాని నరేంద్ర మోదీ లు రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌ కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతి వ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శిరీషను, ఎంపీగా తనను గెలి పించాలని కోరారు. పలాసలో ఆర్మీ, మాజీ ఆర్మీల కార్పొరేషన్‌ను చంద్రబాబు ఏర్పాటు చేసి సైనికులకు ఆదుకోవడం జరుగుతుందన్నారు. పలాసలో కేంద్రీ య విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పలాసలో భూ కబ్జాలు బాగా పెరిగాయని విమర్శించారు. కొండల రాజు ఇక్కడ తిరుగుతున్నాడని, ఎవరి భూములు మింగేస్తారో, ఏ కొండలు దోచుకుంటారో తెలియదని, అటువంటి వారికి చెక్‌పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన తరువాత వీటిని సరైన చర్యలు చేపడతా రన్నారు. ఈ ఐదేళ్లలో పలాసకు మంత్రి ఏం చేశారో చెప్పమని తాను ప్రశ్నిస్తు న్నానన్నారు. మా ట్రాక్‌ రికార్డు ఏంటో ప్రజలకు తెలుసునని, ఆ రికార్డు రేపు బ్యాలెట్‌లో కనబడు తుందన్నారు.
క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ : శిరీష
క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలి పించి రాష్ట్రానికి పునర్వైభవం తీసుకు రావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కోరారు. ఐదున్న రేళ్ల కిందట తితలీ ధాటికి అతలా కుతలమైన పలాసకు అప్పటి ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వచ్చి 14 రోజులు పలాసలో ఉండి తితలీ బాధను తొలగించేందుకు విశేష కృషి చేశార న్నారు. ఒకప్పుడు పలాసకు తెల్లబంగారంగా పేరుండేది కాని ఇప్పుడు పలాస అంటే భూకబ్జాలు, కొండల దోపిడీగా తయారు చేశారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో పలాసలో ఎటువంటి అభివృద్ధి లేదని, రాష్ట్రంతో పాటు పలాసలో కూడా కనీస అభివృద్ధి కరు వైందన్నారు. పలాసకు చంద్రబాబునాయుడు హయాం లోనే ఆఫ్‌షోర్‌ పథకం మంజూరైందని, పలాస మున్సిపాలిటీతో పాటు నందిగాం, మెళియాపుట్టి మండలాలకు తాగు, సాగునీటికై రూ.464 కోట్లతో ఆఫ్‌షోర్‌ను ప్రారంభించారన్నారు. ఈ ఐదేళ్లలో మంత్రి గాలి కబుర్లు చెప్పారే తప్ప ఏ పనులు చేయలేదని, ఆఫ్‌షోర్‌కు రూ.50 కోట్లు.. రూ.500 కోట్లు అన్నారే గాని ఆ డబ్బులు ఎవరి జేబులకు వెళ్లాయో తెలియదన్నారు. మున్సిపాలిటీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తాగునీరు పది రోజులకు ఒకసారి ఇస్తున్నా రన్నారు. జీడికి మద్దతు ధర కల్పించేందుకు కృషి చేయాలని కోరా రు. ఐటీ డీఏను పక్క జిల్లాకు వైసీపీ ప్రభుత్వం తరలించిందన్నారు. మరలా టీడీపీ హయాంలో ఐటీడీఏను జిల్లాకు తీసుకు రావాలని కోరారు. కొండలను కరిగించి కట్టించిన కొత్త కిడ్నీ ఆసు పత్రిలో టీడీపీ ఇచ్చిన డయాలసిస్‌ మిషన్లతోనే చికిత్సలు చేస్తున్నారని, ఉద్దానం కిడ్నీ రిసెర్చ్‌ కేంద్రాన్ని కచ్చింతంగా తీసుకురావా లన్నారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేంద్రాలను పలాస, ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేస్తే వలసలు తగ్గుతాయని, మత్స్యకారుల బతుకుల మార్పు కోసం కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిష్టా త్మకంగా చేపట్టిన టిడ్కో, హుద్‌హుద్‌ ఇళ్లను నిజమైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు. సమావేశంలో టీడీపీ అభ్యర్థులు బగ్గు రమణమూర్తి, మామిడి గోవింద రావు, గొండు శంకర్‌, పలాస నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, దువ్వాడ హేమబాబు చౌదరి, గురిటి సూర్య నారాయణ, జనసేన నాయకులు దుర్గారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, సూరాడ మోహనరావు, గొరకల వసంతరావు, దాసరి తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:30 AM