Share News

చంద్రబాబుకు.. అచ్చెన్న శుభాకాంక్షలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:06 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబుకు.. అచ్చెన్న శుభాకాంక్షలు
చంద్రబాబునాయుడుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న అచ్చెన్నాయుడు

టెక్కలి, జూన్‌ 6: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా కలిసి అభినందించారు. ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజాగళం ద్వారా ప్రజలకు చేరువైన లోకేశ్‌బాబు పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం, టెక్కలిలో అత్యధిక మెజార్టీ సాధించడంపై అచ్చెన్నను కూడా చంద్రబాబు అభినందించారు.

Updated Date - Jun 07 , 2024 | 12:06 AM