Share News

బెంతు ఒరియాలు నిరసన

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:20 PM

కవిటిలో మంత్రి ఎస్‌.అప్పలరాజు తమపై చూపు తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బెంతు ఒరియాలు ఆదివారం నిరసన తెలిపారు.

బెంతు ఒరియాలు నిరసన
నిరసన తెలుపుతున్న బెంతుఒరియా ప్రతినిధులు

కవిటి: కవిటిలో మంత్రి ఎస్‌.అప్పలరాజు తమపై చూపు తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బెంతు ఒరియాలు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు కలిసి నకిలీ బెంతు ఒరియాలపై చర్యలు తీసుకొవాలని కోరుతూ నిరసన తెలియజేస్తే బాధ్యతాయుతమైన మంత్రి వారికి సంఘీభావం తెలియజే యడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి పలాస నియోజకవర్గంలో పర్య టించిన సమయంలో బెంతుఒరియాలపై అధ్యయనానికి కమిషన్‌ వేస్తున్నామని ప్రకటించి నప్పుడు పక్కన ఉన్న మంత్రి అప్పలరాజు హర్షధ్వానాలు తెలిపారన్నారు. అటువంటి పరిస్థితిలో కనీసం కుల ధ్రువీకరణకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా కులస్థులకు న్యాయం చేస్తామని చెప్పే పరిస్థితి లేకపోవడం దారుణ మన్నారు.నకిలీ ధ్రువపత్రాలు పొందిన వారిపై పోరాటంచేయాలి తప్ప గిరిజనులుగా ఉన్న మా మధ్య చీలిక తెచ్చి లబ్ధిపొందాలని మంత్రి యత్నించడం తగ దన్నారు. మంత్రి తీరుకు నిరసనగా కవిటి బస్టాండులో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. 32వ రోజు దీక్షలో కొక్కొలిపుట్టుగ గ్రామస్థులు కూర్చొన్నారు. కార్యక్రమంలో రజనీకుమార్‌ దొళాయి, సుమన్‌బిసాయి, భగవాన్‌ బిసాయి, దుదిష్టిమజ్జి, శ్రీరామ్‌బిసాయి, జాదవ్‌ సాహు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:20 PM