Benthoria: 367వ రోజుకు చేరిన బెంతొరియాల నిరసన
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:56 PM
Benthoria protest enters 367th day బెంతొరి యా కులస్థులు తమ కు ల ధ్రువీకరణ పత్రాలు అందించాలని కోరుతూ కవిటిలో చేపట్టిన నిరసన దీక్ష శనివారం నాటికి 367వ రోజుకు చేరింది.

కవిటి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బెంతొరి యా కులస్థులు తమ కు ల ధ్రువీకరణ పత్రాలు అందించాలని కోరుతూ కవిటిలో చేపట్టిన నిరసన దీక్ష శనివారం నాటికి 367వ రోజుకు చేరింది. ఇచ్ఛాపురం నియోజకవ ర్గంలోని బెంతొరియా కులస్థులకు కులగుర్తింపు లేదు. గతంలో కొన్నేళ్లు గుర్తింపు కల్పించినా ఆ తర్వాత రద్దు చేశా రు. జగన్ ప్రభుత్వంలో రెండు కమిటీలతో అధ్యాయనాలు చేసినా.. ఆ నివేదికలు ఏమైనా యో తెలియని పరిస్థితి. నివాస ధ్రువీకరణను నిలిపివేసి ఈ కులస్థులకు తీరని అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెంతొరియాలకు నివాస ధ్రువ పత్రాలు ఇవ్వ డానికి అనుమతి లభించింది. అయితే వీరు తమకు ఎస్టీ కులధ్రువ పత్రాలు అందించాలని డిమాండ్ చేస్తునే ఉన్నారు. ఈమేరకు కవిటిలో గత ఏడాది కాలంగా బస్టాండ్ ఆవరణలో నిరసన దీక్ష చేపడుతున్నారు. శనివారం కులపెద్దలంతా కలసి నల్లబ్యాడ్జీలు ధరించి ఈ దీక్ష లో కూర్చొన్నారు. వీరికి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ లోళ్ల రాజేష్ సంఘీభావం తెలిపారు. బెంతుల విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకువెళతానన్నారు. కార్యక్రమంలో బెంతొరియా నేతలు రజనీకుమార్ దొళాయి, దేవరాజు సాహు, మెహన్ సాహు, సుమన్ బిసాయి తదితరులు పొల్గొన్నారు.