Share News

రెండేళ్లకే బీటలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:00 AM

సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం రెండేళ్లకే బీటలు వారుతోంది. పాత తహసీల్దార్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో రెవెన్యూ సిబ్బంది భయాందోళనతో ఉద్యోగాలు నిర్వహించేవారు.

రెండేళ్లకే బీటలు
తహసీల్దార్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, సిబ్బంది గదుల్లో ఏర్పడిన బీటలు

- తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణంలో నాణ్యత లోపం

- బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు

(సోంపేట)

సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం రెండేళ్లకే బీటలు వారుతోంది. పాత తహసీల్దార్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో రెవెన్యూ సిబ్బంది భయాందోళనతో ఉద్యోగాలు నిర్వహించేవారు. దీంతో టీడీపీ హయాంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నిర్మాణం నిలిచిపోయింది. స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడంతో ఆదరబాదరాగా 2022 మార్చిలో కార్యాలయాన్ని నిర్మించి.. మంత్రులు ప్రారంభించారు. కాగా.. ప్రారంభించి రెండేళ్ల కాకముందే కార్యాలయంలో ఎక్కడ చూసినా బీటలు కనిపిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్‌ నాసిరకంగా పనులు చేపట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌ఐ, వీడియో కాన్ఫరెన్స్‌, సిబ్బంది గదులు ఇలా ఎక్కడ చూసినా.. బీటలు వారడంతో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:00 AM