ఉద్దానంలో ఎలుగులు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:16 PM
మందస మండలం ఉద్దానం ప్రాంతమైన సరియాపల్లి, బహాడపల్లి, జంతిబంద పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఎలుగుబంట్లు సంచరించాయి.

- భయాందోళనలో ప్రజలు
హరిపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి):మందస మండలం ఉద్దానం ప్రాంతమైన సరియాపల్లి, బహాడపల్లి, జంతిబంద పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఎలుగుబంట్లు సంచరించాయి. నాలుగు ఎలుగులు గ్రూపుగా సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. జీడితోటల్లో రైతులు పనులు చేస్తుంటారు. తుప్పలు, ముళ్లపొదలు, గడ్డి తొలగించి.. దుక్కులు దున్నుతుంటారు. ఎలుగుల సంచారం అధికమవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్లలో వరుసుగా దున్నూరు, ఎర్రముక్కాం, బాతుపురం గ్రామాల్లో జరిగిన ఎలుగుబంట్ల దాడుల్లో సుమారు ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు నేటికీ వివిధ వ్యాధుల బారిన పడి దివ్యాంగులుగా మారారు. దీంతో ఎలుగులను చూస్తే రైతులు హడలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుల నుంచి రక్షణ కల్పించాలని వారంతా కోరుతున్నారు.