Share News

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:55 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఎన్నికలపై పోలీసు, కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 29: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఎన్నికలపై పోలీసు, కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న నిఘా వివరాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ‘ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఎక్కడా మద్యం, నగదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట నిఘా ఉంచాలి. సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టులో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత ఎంసీసీ, ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ, వీఎస్టీ తదితర అన్ని టీములు అప్రమత్తం కావాలి. చెక్‌పోస్టుల్లో సీజ్‌ చేసిన వివరాలను ప్రతీరోజు రిపోర్టు రూపంలో అందించాలి. ఎక్కడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలి. సంబంధిత శాఖలు సమన్వయంతో విధులు నిర్వర్తించాల’ని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా అటవీ అధికారి నిషాకుమారి, డీఆర్వో ఎం.గణపతిరావు, ఏఎస్పీ ప్రేమ్‌కాజల్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సూర్యకిరణ్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి నాగరాజు, డీటీవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:55 PM