Share News

సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - May 01 , 2024 | 11:37 PM

కార్మిక సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణమూర్తి కోరారు.

సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఏఐటీయూసీ నేతలు

అరసవల్లి: కార్మిక సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణమూర్తి కోరారు. అంతర్జాతీయ కార్మిక దినో త్సవాన్ని బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక పతాకాన్ని ఎగుర వేశారు. కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్లుగా మార్పు చేసి కార్మిక హక్కులను కాలరాసిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, ఎం.ప్రభాకర్‌, ఎన్‌.గోపి, పొందూరు చంద్రరావు, ఆర్‌.ప్రకాష్‌, వెంకట్రావు పాణిగ్రాహి, లక్ష్మి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటంతోనే హక్కుల పరిరక్షణ
కేంద్రప్రభుత్వం పలు కార్మిక చట్టాలను సవరించడం ద్వారా వారి హక్కులకు పెను ప్రమాదం ఏర్పడిందని, ఐక్య పోరాటాలతో వాటిని రక్షించుకోవాలని ఏఐటీయూసీ నాయ కులు అన్నారు. మేడే సందర్భంగా బుధవారం ఉదయం మునిసిపల్‌ కార్యాలయం, సివిల్‌ సప్లయి గొడౌన్స్‌, మార్కెట్‌ యార్డ్‌, రామలక్ష్మణ జంక్షన్‌, చిత్తరంజన్‌ వీధిలో ఎర్ర జెండా లను ఎగురవేశారు. రామలక్ష్మణ కూడలి నుంచి సూర్యమహల్‌ జంక్షన్‌ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు, నాయకులు టి.తిరుపతిరావు, చిక్కాల గోవిందరావు, కల్యాణి అప్పల రాజు, పార్థసారధి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను నిర్వహించారు.

Updated Date - May 01 , 2024 | 11:37 PM