Share News

తెలగ కులస్థులకు బీసీ రిజర్వేషన్‌ కల్పించాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:43 PM

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న తెలగ కులస్థులను ఆదుకోవాలని ఉత్తరాంధ్ర తెలగ కుల సంఘం అధ్యక్షుడు పల్లంట్ల వెంకటరామారావు డిమాండ్‌ చేశారు. ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్ర వారం టెక్కలికి చేరుకుంది.

తెలగ కులస్థులకు బీసీ రిజర్వేషన్‌ కల్పించాలి
వెంకటరామారావుకు స్వాగతం పలుకుతున్న టెక్కలి తెలగ సంఘ నేతలు

టెక్కలి: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న తెలగ కులస్థులను ఆదుకోవాలని ఉత్తరాంధ్ర తెలగ కుల సంఘం అధ్యక్షుడు పల్లంట్ల వెంకటరామారావు డిమాండ్‌ చేశారు. ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్ర వారం టెక్కలికి చేరుకుంది. ఈ సంద ర్భంగా ఆయనకు స్థానిక సంఘ నేతలు దోని కొండలరావు, ఇల్లా కోదండ, బొంగు పెంటయ్య, గుర్జు దాసు, పువ్వల ఢిల్లీ, ఇండుగ సోమేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలగ కులస్థులు సన్నకారు రైతులుగా, రైతు కూలీ లుగా, భవన నిర్మాణ కార్మికులుగా బతుకు వెళ్లదీస్తున్నారన్నారు. తెలగ కులస్థులకు బీసీ రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు.

Updated Date - Feb 02 , 2024 | 11:43 PM