లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:50 PM
కోటబొమ్మాళి జూనియర్ సివిల్ కోర్డులో సెప్టెంబరు 14న జరగ నున్న జాతీయ లోక్‌అదాలత్‌పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి, మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షురాలు బీఎంఆర్ ప్రసన్నలత తెలిపారు.
కోటబొమ్మాళి:కోటబొమ్మాళి జూనియర్ సివిల్ కోర్డులో సెప్టెంబరు 14న జరగ నున్న జాతీయ లోక్‌అదాలత్‌పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి, మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షురాలు బీఎంఆర్ ప్రసన్నలత తెలిపారు. శనివారం కోటబొమ్మాళి కోర్టులో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, జలుమూరు తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులతో సమీ క్షించారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి, జలుమూరు తహసీల్దార్లు ఆర్. అప్పలరా జు, జి.లక్ష్మీనారాయణ, సంతబొమ్మాళి డీటీ హరిబాబు, జలుమూరు ఎంపీడీవో పి.ఉమామహేశ్వరరావు, ఎస్సీబీ సబ్ ఇన్‌స్పెక్టర్ కుమార్ పాల్గొన్నారు.