Share News

ఓట్ల లెక్కింపుపై అవగాహన తప్పనిసరి

ABN , Publish Date - May 24 , 2024 | 11:38 PM

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. శుక్రవారం అంబేడ్కర్‌ ఆడిటోరియంలో.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధివిధానాలపై సూపర్‌వైజర్లు, మైక్కో అబ్జర్వర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.

ఓట్ల లెక్కింపుపై అవగాహన తప్పనిసరి
మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, మే 24: ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. శుక్రవారం అంబేడ్కర్‌ ఆడిటోరియంలో.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధివిధానాలపై సూపర్‌వైజర్లు, మైక్కో అబ్జర్వర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ుపోలింగ్‌ మాదిరి.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తిచేయాలి. కచ్చితమైన, సమర్థవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్ల లెక్కించాలి. లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి. పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా వ్యవహరించాలి్‌ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.గణపతిరావు, మాస్టర్‌ ట్రైనర్లు కిరణ్‌, ఎన్‌.బాలాజీ, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, శేషగిరి, జిల్లావ్యాప్తంగా 350 మంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

శ్రీకాకుళం క్రైం: చిలకపాలెంలోని శివానీ కళాశాలల్లో ఈ నెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ రాధిక ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో.. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. ఎస్పీ రాధిక మాట్లాడుతూ.. ుఓట్ల లెక్కింపు వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, జిల్లా ఆర్మ్‌ ్డ రిజర్వ్‌, సివిల్‌ పోలీసులతో మూడంచెల బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ రెగ్యులేషన్‌, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 144 సెక్షన్‌ ప్రకారం పక్కాగా అమలు చేయాలి. వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లు వాహనాలను నిర్ధేశించిన పార్కింగ్‌ కేంద్రాలకు తరలించాలి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా దిక్సూచి బోర్డులను ఏర్పాటు చేయాలి. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లే ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. రిటర్నింగ్‌ అధికారి అనుమతి పత్రాలను పరిశీలించిన తరువాతే అనుమతించాలి. రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్స్‌ మినహా మిగిలినవారి ఫోన్లను కేంద్రాల్లోకి అనుమతించరాదు. ఫలితాలు వెల్లడైన తరువాత అల్లర్లు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్‌ని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా పేలుళ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్పీలు డా. జి.ప్రేమ్‌ కాజల్‌, వి.ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు బాలచందర్‌రెడ్డి, వై.శృతి, త్రినాథరావు, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, విజయకుమార్‌, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:38 PM