Share News

తగాదాలకు దూరంగా ఉండాలి: సీఐ

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:59 PM

అనవసర తగాదాలకు దూరంగా ఉండాలని ఆమదాలవ లస సీఐ దివాకర్‌ అర్జున్‌యాదవ్‌ కోరారు.శనివారం మండలంలోని ఉప్పినివలస గ్రామస్థులతో సమా వేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికలు గ్రామాల్లో ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

  తగాదాలకు దూరంగా ఉండాలి: సీఐ

బూర్జ: అనవసర తగాదాలకు దూరంగా ఉండాలని ఆమదాలవ లస సీఐ దివాకర్‌ అర్జున్‌యాదవ్‌ కోరారు.శనివారం మండలంలోని ఉప్పినివలస గ్రామస్థులతో సమా వేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికలు గ్రామాల్లో ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు

శ్రీకాకుళం క్రైం: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును విని యోగించుకొనేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం సీఐ ఎల్‌.సన్యాసినా యుడు తెలిపారు. గురువారం శ్రీకాకుళంనగరంలోని దమ్మలవీధిలో గల పోలింగ్‌ కేంద్రాలు,ఇన్‌,ఔట్‌ దారులను పరిశీలించారు. ఈ సందర్భంగా సన్యాసి నాయుడు అనవసర ఘర్షణలకు పాల్పడకుండా శాంతిభద్రతకు విఘాతం కలి గించే వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని కోరారు.కార్యక్రమంలో ఒన్‌టౌన్‌ ఎస్‌ఐ బలివాడ గణేష్‌ పాల్గొన్నారు.

సమస్యాత్మక గ్రామాలపై దృష్టి

జి.సిగడాం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు. శనివారం గెడ్డకంచరాంలో అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.ఎన్నికలు దృష్ట్యా గ్రామస్థులు అవాంచనీయ సంఘటనలకు తావివ్వ కుండా చర్యలుతీసుకోవాలని కోరారు.

Updated Date - Apr 06 , 2024 | 11:59 PM