Share News

భార్య మందలించిందని..

ABN , Publish Date - May 25 , 2024 | 11:40 PM

పేదలకు ఇచ్చే ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని స్థానిక కోర్టు న్యాయాధికారి హరిప్రియ అన్నారు. శనివారం స్థానిక సబ్‌జైల్‌ను సందర్శించారు.

భార్య మందలించిందని..

నరసన్నపేట: పేదలకు ఇచ్చే ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని స్థానిక కోర్టు న్యాయాధికారి హరిప్రియ అన్నారు. శనివారం స్థానిక సబ్‌జైల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేరప్రవృత్తితో జీవితాలు నాశనమౌతాయన్నారు. న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వ ర్యంలో ఉచిత న్యాయసేవలను అందించడం జరుగుతుందని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. జైలులో భోజన, వసతి సదుపాయాలను అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో ఏజీపీ జి.సత్యనారాయణ, న్యాయవాదులు టి.మధుసూదనరావు, ఆర్‌.కృష్ణంనాయుడు, డి.రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 29 జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కక్షిదారులకు అవగాహన కలిగించాలని ఆమె పోలాకి, నరసన్నపేట ఎస్‌ఐలకు సూచించారు.

గూనభద్రలో న్యాయ విజ్ఞాన సదస్సు

కొత్తూరు: గూనభద్ర గ్రామంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జూని యర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.రాణి మాట్లాడుతూ.. బాలబాలికల అపహరణ జరుగు తోందని, దీని నివారణకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపా లని, పనికి పంపడం నేరమన్నారు. అనంతరం బాలల హక్కులను వివరించారు. కార్య క్రమంలో ఎస్‌ఐ అహ్మద్‌, ఏజీపీ రాడ రాజు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.అప్పారావు, న్యాయవాదులు ధర్మారావు, గేదెల ఫల్గుణ రావు, సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:40 PM