Share News

చెరువు కబ్జాకు వైసీపీ నేతల యత్నం

ABN , Publish Date - May 14 , 2024 | 11:51 PM

సరుబుజ్జిలి మండలం మూలసవలాపురంలోని కామినాయుడు చెరువును మంగళవారం స్థానిక వైసీపీ నేతలు కబ్జాకు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఇటీవల 60 ఎకరాలు ఉన్న ఈ చెరువు గర్భంలో సుమారు 7ఎకరాల భూమిని ముగ్గురు వైసీపీ నాయకులు ఆక్రమించినట్టు గ్రామస్థులు ఆరోపించారు.

చెరువు కబ్జాకు వైసీపీ నేతల యత్నం
చెరువు ఆక్రమణను అడ్డుకుంటున్న గ్రామస్థులు

- అడ్డుకున్న మూలసవలాపురం గ్రామస్థులు

సరుబుజ్జిలి, మే 14: సరుబుజ్జిలి మండలం మూలసవలాపురంలోని కామినాయుడు చెరువును మంగళవారం స్థానిక వైసీపీ నేతలు కబ్జాకు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఇటీవల 60 ఎకరాలు ఉన్న ఈ చెరువు గర్భంలో సుమారు 7ఎకరాల భూమిని ముగ్గురు వైసీపీ నాయకులు ఆక్రమించినట్టు గ్రామస్థులు ఆరోపించారు. మంగళవారం ఆ ఆక్రమిత భూములకు గట్టులు వేసి.. హద్దులు నిర్ణయించుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన ఇరుపార్టీల ప్రజలు చెరువు వద్దకు చేరుకుని.. ఆక్రమణను అడ్డుకున్నారు. ఈ చెరువు ఆక్రమణకు గురైతే ఉపాధి పనులు కోల్పోతామని వేతనదారులు ఆందోళన చేశారు. దీనిపై రెవెన్యూ అధికారి, తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆక్రమణదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామస్థులు ఆ గట్లను తొలగించారు. కాగా.. చెరువు ఆక్రమణ విషయాన్ని తెలియజేసేందుకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా.. తహసీల్దార్‌ కామినాయుడు స్పందించలేదని గ్రామస్థులు ఆరోపించారు. 150 ఎకరాలకు సాగునీరందిస్తున్న ఈ చెరువును కాపాడుకుంటామని, దీనిపై కలెక్టర్‌కు, జిల్లా రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - May 14 , 2024 | 11:51 PM