భార్యపై కత్తితో దాడి
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:59 PM
మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై కత్తితో దాడిచేసి ఘటన ఇచ్ఛాపురం పట్టణంలో చోటుచేసుకుంది.
ఇచ్ఛాపురం: మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై కత్తితో దాడిచేసి ఘటన ఇచ్ఛాపురం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముడియావీధికి చెందన సుదర్శన శ్రీను, దుర్గ భార్య, భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను ఒక ప్రైవేట్ వాహనంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ మద్యం తాగి వచ్చి.. భార్యపై అనుమానంతో గొడవ పడుతుండేవారు. రోజూ లాగానే ఆదివా రం రాత్రి మద్యం తాగి వచ్చిన శ్రీను భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో దుర్గపై దాడి చేశాడు. దీంతో ఆమె తలపై, చేతులపై తీవ్రగాయాల య్యాయి. దీంతో ఆమెన ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పరిస్థతి విషమించడంతో బరంపురం తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. దాడికి పాల్పడిన శ్రీను పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.