Share News

ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులు

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:13 PM

జిల్లా క్రీడాకారులు రాష్ట్రంలోని వివిధ వేదికల్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటి ద్వితీయస్థానాలు కైవశం చేసుకున్నారు. విజయన గరం జిల్లా కొత్తవలసలో రాష్ట్రస్థాయి అండర్‌-19 బాలుర హ్యాండ్‌బాల్‌, అనంతపు రంలో జరిగిన ఫుట్‌బాల్‌ బాలుర పోటీల్లో ద్వితీయస్థానం సాధించారు.

ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులు
హ్యాండ్‌బాల్‌లో ద్వితీయస్థానం సాధించిన జిల్లా క్రీడాకారులు:

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రీడాకారులు రాష్ట్రంలోని వివిధ వేదికల్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటి ద్వితీయస్థానాలు కైవశం చేసుకున్నారు. విజయన గరం జిల్లా కొత్తవలసలో రాష్ట్రస్థాయి అండర్‌-19 బాలుర హ్యాండ్‌బాల్‌, అనంతపు రంలో జరిగిన ఫుట్‌బాల్‌ బాలుర పోటీల్లో ద్వితీయస్థానం సాధించారు. ఈ పోటీలకు కోచ్‌, మేనేజర్లుగా గోపిక,ఈశ్వరరావు, ఆర్‌.సతీష్‌రాయు, గణపతి, శ్రీనులు వ్యవహరిం చారు.ఈమేరకు సత్తాచాటిన క్రీడాకారులకు జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ముఖ్యసలహాదారు పి.సుందరరావు, పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీరమణ అభినందించారు.

జాతీయస్థాయిలో సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులు..

జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో సత్తాచాటారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈనెల ఆరు నుంచి పదో తేదీ వరకు జరిగిన జాతీ యస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌లో బాలురు తృతీయస్థానం సాధిం చారు. ఈమేరకు రాష్ట్ర జట్టులో జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు మెట్ట అఖిల్‌, యుతిరాజులు లక్ష్మీప్రసాద్‌, మొదలవలస యశ్వంత్‌ (కేశవరావుపేట), సింహా ద్రి (ఇప్పిలి) పాల్గొన్నారు. వీరికి జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కలిదిండి నర సింహారాజు, కార్యదర్శి సిగిలిపెల్లి లక్ష్మీదేవి, కన్వీనర్‌ కె.వెంకటరమరాజు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం.వి.రమణ, ఉపాధ్యక్షులు మెట్ట తిరుపతిరావు, సభ్యులు జి.మల్లేష్‌, పి.వెం కటరమణ తదితరులు అభినందించారు.

ఆల్‌ ఇండియా ర్యాకింగ్‌ టోర్నీకి శాన్వీ అర్హత

పాతపట్నానికి చెందిన లట్టాలశాన్వీ ఆల్‌ఇండియా ర్యాంకింగ్‌టోర్నమెంట్‌లో మెయి న్‌ డ్రాకు అర్హత సాధించింది. అసోంలోని డిబ్రూగర్‌లో ఈనెల 24 నుంచి జరుగుతు న్న అండర్‌-13 ఆల్‌ఇండియా సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో అసోం క్రీడాకారిణి తనిష్క్‌పై విజయం సాధించింది. తొమ్మిదేళ్ల శాన్వీ ఆడుతున్న మొదటిఅండర్‌-13 ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లోఉత్తమనైపుణ్యం ప్రదర్శించడంతో మ్యాచ్‌ పాయింట్‌ చైర్మన్‌, హెడ్‌కోచ్‌ వేణు ముప్పాల, అంతర్జాతీయ క్రీడాకారులు జేబీఎస్‌ విద్యాధర్‌, బీవీఎస్‌కే లింగేశ్వరరావు, ఇంటర్నేషనల్‌ ఎంపైర్‌ సంపతిరావు సూరిబాబు, జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్‌ తదితరులు అభినందించారు.

Updated Date - Oct 27 , 2024 | 11:13 PM