పార్టీ సభ్యత్వంతో భరోసా: ఎంజీఆర్
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:33 PM
టీడీపీ సభ్యత్వంతో ప్రతి కుటుంబానికి భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వంతో ప్రతి కుటుంబానికి భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నంలోని తన క్యాంపు కార్యాల యంలో సోమవారం పార్టీ సభ్యత్వంపై పార్టీ నేతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్దేశించిన విధం గా పార్టీ సభ్యత్వాలను చేపట్టా లన్నారు. సభ్యత్వం కోసం రూ.100 చెల్లిస్తే రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా సదుపా యం కలుగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశార న్నారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ లక్ష్యాలను అధిగమించాలని కోరారు. పాతపట్నం, మెళియా పుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొ న్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే పార్టీ సభ్యత్వంపై నిర్వహించిన సమావేశానికి పలువురు సీనియర్ నాయకులు హాజరు కాక పోవడంపై గుసగుసలు వినిపించాయి. అయితే తమకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు సీనియర్ల నుం చి వినిపిస్తోంది.