Share News

నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌

ABN , Publish Date - May 15 , 2024 | 11:52 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్‌-2024 గురువారం నుంచి ప్రారంభంకానుంది.

నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌

- జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు

- ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఎచ్చెర్ల, మే 15: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్‌-2024 గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ పరీక్ష కోసం జిల్లాలో శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం), వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎచ్చెర్ల), ఐతం (టెక్కలి), కోర్‌ టెక్నాలజీస్‌ (నరసన్నపేట) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం గంటల 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజూ రెండు షిప్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్‌టీయూ (కాకినాడ) పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగనుంది. నిర్దేశించిన సమయానికి రెండు గంటల ముందు నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి అభ్యర్థులు కచ్చితంగా చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని నిర్వాహకులు వెల్లడించారు. హాల్‌టిక్కెట్‌, ఒరిజనల్‌ గుర్తింపు కార్డుతో హాజరు కావాలి. ఏ రకమైన ఎలకా్ట్రనిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

Updated Date - May 15 , 2024 | 11:52 PM