Share News

ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్‌

ABN , Publish Date - May 17 , 2024 | 12:02 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, సెరికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు ఏపీ ఈఏపీ సెట్‌ గురువారం ప్రారంభమైంది.

ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్‌
శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అభ్యర్థుల హాల్‌టికెట్లను పరిశీలన

ఎచ్చెర్ల/ నరసన్నపేట, మే 16: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, సెరికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు ఏపీ ఈఏపీ సెట్‌ గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల(చిలకపాలెం), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల(ఎచ్చెర్ల), ఐతం (టెక్కలి), కోర్‌ టెక్నాలజీస్‌ (నరసన్నపేట) కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జేఎన్‌టీయూ (కాకినాడ) పర్యవేక్షణలో ఈ నెల 23 వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతిరోజు రెండు షిఫ్ట్ట్‌ల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయి. శివానీ కళాశాలలో రెండు షిఫ్ట్‌ల్లో పరీక్షలకు 412 మంది విద్యార్థులకు 375 మంది హాజరయ్యారు. 37 మంది గైర్హాజరయ్యారు. వెంకటేశ్వర కళాశాలలో 346 మంది విద్యార్థులకుగానూ 339 మంది హాజరుకాగా, ఏడుగురు గైర్హాజరయ్యారు. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీ కేంద్రంలో 660 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 49 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - May 17 , 2024 | 12:02 AM