అంగన్‌వాడీలు సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:51 PM
అంగన్ వాడీ కార్యకర్తలు సమయ పాలన పాటించాలని డీఎస్‌వో శాంతిప్రియ కార్య కర్తలను ఆదేశించారు. శనివారం మండలంలోని రెంటికోటలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీచేశారు.
పలాస రూరల్: అంగన్ వాడీ కార్యకర్తలు సమయ పాలన పాటించాలని డీఎస్‌వో శాంతిప్రియ కార్య కర్తలను ఆదేశించారు. శనివారం మండలంలోని రెంటికోటలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీచేశారు. ఇద్దరు కార్యకర్తల్లో ఒకరు హాజరుకాకపోవడంపై ఆయాలను ప్రశ్నించారు. కేం ద్రానికి సరైన సమయంలో హాజరుకావాలని, పిల్లల హాజరు, పంపిణీ రికార్డులు నిర్వహించాలని కోరారు. శానిటేషన్, మౌలిక వసతు లపై ఆరాతీశారు. అనంత రం స్థానిక రేషన్‌డిపోను పరిశీలించి బియ్యం తూకం పరిశీలించారు. కార్య క్రమంలో సీఎస్‌డీటీ ఎస్.రవికుమార్, వీఆర్వో సురేష్‌కుమార్ పాల్గొన్నారు.