Share News

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలకు వేళాయె

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:45 PM

సంక్రాంతిని పురస్క రించుకుని ఏటా ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వ హిస్తోంది. మహిళా విజేతలకు నగదు పురస్కారాలు అందజేస్తోంది. ఆన వాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా పోటీలు నిర్వహించనుంది.

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలకు వేళాయె
పలాసలో ముగ్గుల పోటీలకు సిద్ధమైన మదర్‌థెరిసా క్రీడా మైదానం

- నేడు పలాసలో మదర్‌థెరీసా పాఠశాల మైదానంలో..

- రేపు శ్రీకాకుళంలో ఎన్టీఆర్‌ ఎంసీహెచ్‌ గ్రౌండ్‌లో నిర్వహణ

- మహిళలకు మాత్రమే అవకాశం

- విజేతలకు నగదు పురస్కారాలు

ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/పలాస, జనవరి 5: సంక్రాంతిని పురస్క రించుకుని ఏటా ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వ హిస్తోంది. మహిళా విజేతలకు నగదు పురస్కారాలు అందజేస్తోంది. ఆన వాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా పోటీలు నిర్వహించనుంది. ‘‘ఆంధ్ర జ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’’ సహకారంతో జిల్లాలో రెండు చోట్ల జరుగనున్నాయి. ప్రథమ విజే తకు రూ.6వేలు, ద్వితీయ విజేతకు రూ.4వేలు, తృతీయ విజేతకు రూ.3 వేలు చొప్పున నగదు పురస్కారాలను అందజేస్తారు.

- పలాస మునిసిపాలిటీ పరిధి శివాజీనగర్‌లోని మదర్‌థెరిసా విద్యాలయంలో శనివారం ముత్యాల ముగ్గు లపోటీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉద యం 10 నుంచి 12గంటల వరకు పోటీలు నిర్వహిస్తారు. ఏర్పాట్ల ను మదర్‌థెరిసా విద్యా సంస్థల డైరెక్టర్‌ వజ్జ బాబూరావు, చైర్మన్‌ వజ్జ భవానీ శుక్రవారం పర్యవేక్షించారు.

- శ్రీకాకుళంనగరంలో ఎన్టీఆర్‌ ఎంసీహెచ్‌స్కూల్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఎటువంటి రుసుము లేకుండా మహిళలు అందరూ ఉచితంగా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇదిలా ఉండగా పోటీల నిర్వహణకు పలాసలో మదర్‌థెరీసా విద్యాలయం యాజమాన్యం సహకారం అందిస్తోంది. శ్రీకాకుళంలో మీనాక్షి ఆసుపత్రి అధినేతలు గొండు శంకర్‌(కృష్ణప్పపేట), డాక్టర్‌ గొండు గంగాధర్‌(గ్యాస్టోఎంట్రాలజిస్ట్‌) స్పాన్స ర్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందే విజేతను రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారు.

- నిబంధనలు ఇవీ

మహిళలు మాత్రమే పాల్గొనాలి. ముగ్గు, రంగులు, పువ్వులు వగైరా సామగ్రి వారే తెచ్చుకోవాలి. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు చెప్పగలిగి ఉండాలి. ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం రెండు గంటలు. ముగ్గును చేతితోనే వేయాలి. జల్లెడ ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది. ముగ్గులో గొబ్బెమ్మలను, బతుకమ్మలను అమర్చవచ్చు. అవి తప్ప ఇతరత్రా వస్తువులను అమర్చకూడదు. ఆసక్తిచూపే మహిళలు నేరుగా పోటీల వద్దకు చేరుకోవచ్చును. మరింత సమాచారం కోసం పలాస-9440543464, శ్రీకాకుళం-9985411526 నంబర్లను సంప్రదించాలి.

Updated Date - Jan 05 , 2024 | 11:45 PM