Share News

పోలీసులకు చిక్కిన అంతర్‌ జిల్లాల దొంగ

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:54 PM

రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేరాలకు పాల్పడిన దొంగ రెండో పట్టణ పోలీసులకు చిక్కాడు. టూటౌన్‌ సీఐ జి.ఉమామహేశ్వరరావు కథనం మేరకు... తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలో గాదరాడ గ్రామా నికి చెందిన దేవన బుజ్జి ఈనెల 26 అర్ధారాత్రి దాటిన తర్వాత శ్రీకాకుళంలోని డేఅండ్‌ నైట్‌ కూడలిలో ఉన్న మహాలక్ష్మి మెడికల్‌ షాపు షట్టర్‌ తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు.ఈమేరకు ఆ షాపు యజమాని రెండో పట్టణ పోలీసులకు 27న సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన సీఐ ఉమామహేశ్వరరావు షాపులోని సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దొంగత నానికి పాల్పడిన వ్యక్తి బుధవారం సాయంత్రం ఆర్ట్స్‌ కళాశాల రోడ్డు సంచరి స్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ హరికృష్ణ క్రైం పార్టీతో వెతకడం ప్రారంభించారు. స్టేడియం సమీపంలో అనుమానాస్ప దంగా తిరుగుతుండగా దేవన బుజ్జిని పట్టుకుని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు బుజ్జీ అంగీకరించడంతోపాటు షాపులో దొంగలించిన 83,900రూపాయలను పోలీసులు రికవరీచేశారు. అయితే బుజ్జిపై పలు జిల్లాల్లో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 పోలీసులకు చిక్కిన అంతర్‌ జిల్లాల దొంగ

శ్రీకాకుళం క్రైం: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేరాలకు పాల్పడిన దొంగ రెండో పట్టణ పోలీసులకు చిక్కాడు. టూటౌన్‌ సీఐ జి.ఉమామహేశ్వరరావు కథనం మేరకు... తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలో గాదరాడ గ్రామా నికి చెందిన దేవన బుజ్జి ఈనెల 26 అర్ధారాత్రి దాటిన తర్వాత శ్రీకాకుళంలోని డేఅండ్‌ నైట్‌ కూడలిలో ఉన్న మహాలక్ష్మి మెడికల్‌ షాపు షట్టర్‌ తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు.ఈమేరకు ఆ షాపు యజమాని రెండో పట్టణ పోలీసులకు 27న సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన సీఐ ఉమామహేశ్వరరావు షాపులోని సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దొంగత నానికి పాల్పడిన వ్యక్తి బుధవారం సాయంత్రం ఆర్ట్స్‌ కళాశాల రోడ్డు సంచరి స్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ హరికృష్ణ క్రైం పార్టీతో వెతకడం ప్రారంభించారు. స్టేడియం సమీపంలో అనుమానాస్ప దంగా తిరుగుతుండగా దేవన బుజ్జిని పట్టుకుని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు బుజ్జీ అంగీకరించడంతోపాటు షాపులో దొంగలించిన 83,900రూపాయలను పోలీసులు రికవరీచేశారు. అయితే బుజ్జిపై పలు జిల్లాల్లో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - Feb 28 , 2024 | 11:54 PM