Share News

వక్ఫ్‌ ఆస్తులను కాజేయడానికే చట్ట సవరణ

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:51 PM

వక్ఫ్‌ చట్ట సవరణ బి ల్లు ముస్లిం మై నార్టీలను వక్ఫ్‌ బోర్డు నుంచి తొ లగించేలా ఉంద ని, ఈ బిల్లును పార్లమెంటులో ప్రశేపెట్టిన కేంద్ర ప్రభుత్వం మైనార్టీల వ్యతిరేక చర్య కు పూనుకుందని పలువురు అభిప్రాయపడ్డారు.

వక్ఫ్‌ ఆస్తులను కాజేయడానికే చట్ట సవరణ

శ్రీకాకుళం కల్చరల్‌: వక్ఫ్‌ చట్ట సవరణ బి ల్లు ముస్లిం మై నార్టీలను వక్ఫ్‌ బోర్డు నుంచి తొ లగించేలా ఉంద ని, ఈ బిల్లును పార్లమెంటులో ప్రశేపెట్టిన కేంద్ర ప్రభుత్వం మైనార్టీల వ్యతిరేక చర్య కు పూనుకుందని పలువురు అభిప్రాయపడ్డారు. నగరంలోని జామియా మసీదులో శనివారం వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు పై అఖిల పక్ష చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ముస్లిమేతరులను వక్ఫ్‌ కమిటీల్లో పెట్టాలని, వా రికి కూడా హక్కులు కల్పించాలనడంలో కేంద్ర ప్రభుత్వ కపటత్వం బయట పడింద న్నారు. ముస్లిముల పై చిత్తశుద్ధి ఉంటే సచార్‌ కమీటీ నివేదిక, రంగనాఽథ్‌ మిశ్రా క మిషన్‌ సిఫారుసులపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరారు. కార్యక్రమంలో మహిబు ల్లాఖాన్‌, సురంగి మోహనరావు, రౌతు శంకరరావు, వీజీకే మూర్తి, భవిరి కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, గంజి ఆర్‌.ఎజ్రా, కంఠ వేణు, గణేష్‌, పిసిని చంద్రమోహన్‌, బాడాన దేవభూషణరావు, భాషా, మహబుల్లా ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:51 PM