అమరావతికి ఎంపీ కలిశెట్టి ఒక నెల జీతం
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:51 PM
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి రాజధాని నిర్మాణానికి తన ఒక నెల జీతాన్ని సీఎం చంద్రబాబుకు అం దించారు.

రణస్థలం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి రాజధాని నిర్మాణానికి తన ఒక నెల జీతాన్ని సీఎం చంద్రబాబుకు అం దించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అమరావతి, పోలవరంతో పాటు కీలక ప్రాజెక్టులకు చేయూత నివ్వాలని కోరారు. ఆయన వెంట ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలు ఉన్నా రు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి తన తొలి నెల జీతం రూ.1.57 లక్షల చెక్కును చంద్రబాబుకు అందించా రు. దీంతో కలిశెట్టిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.